Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముజఫర్ నగర్ అల్లర్లపై మండిపడ్డ బీజేపీ

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో మళ్లీ మత అల్లర్లు చెలరేగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది కాలంగా ఆ ప్రాంతంలో మత అల్లర్లు, హింస తలెత్తుతుంటే వాటికి అడ్డుకట్ట వేయడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విఫలమయ్యారని బీజేపీ నేత అభిమన్యు సింగ్ అన్నారు. అఖిలేష్ పక్షపాతరహితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తాజా అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

More Telugu News